News March 7, 2026

సివిల్స్‌లో సత్తా చాటడం రాష్ట్రానికే గర్వకారణం: అడ్లూరి

image

జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ ర్యాంకులు సాధించడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది ఉత్తమ ఫలితాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. దళిత యువతకు నాణ్యమైన శిక్షణ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేద విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు సోపానాలుగా మారుతున్నాయన్నారు.

Similar News

News March 9, 2026

అనంత: YCP సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

image

ITDP నాయకురాలు జె.రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన అనంతపురం (D) మద్దెలచెరువుకు చెందిన YCP సోషల్ మీడియా కన్వీనర్ మదిగుబ్బ అశోక్‌ను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. TTD ఛైర్మన్ BR నాయుడు వ్యవహారంలో రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన అశోక్‌ను అరెస్ట్ చేసినట్లు CI నాయబ్ రసూల్ తెలిపారు. నిందితుడు సయ్యద్‌ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి విధితమే.

News March 9, 2026

మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతుంది: UAE రాయబారి

image

ఇజ్రాయెల్, ఇరాన్‌ నేతలకు PM మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతుందని ఇండియాలో UAE రాయబారి హుస్సేన్ హాసన్ మీర్జా అన్నారు. గల్ఫ్ నేతలే కాకుండా ప్రజలు, బిజినెస్ కమ్యూనిటీల్లోనూ మోదీపై గౌరవం ఉందని చెప్పారు. యుద్ధంలోకి దిగే ఆలోచన తమకు లేదని, UAEని లాంచింగ్ ప్యాడ్‌గా వాడుకునేందుకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఇరాన్‌ తమ పొరుగు దేశమని, ఇజ్రాయెల్ మిత్రపక్షమని, రెండింటితోనూ చర్చలు జరపగలమని తెలిపారు.

News March 9, 2026

PPM: కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్‌కు 95 అర్జీలు

image

పార్వతీపురం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించి 95 అర్జీలను స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు అర్జీలను అందజేశారు. కలెక్టర్ నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, DRO హేమలత ఉన్నారు.