News May 4, 2024
IPL: బెంగళూరు బౌలింగ్
గుజరాత్‌తో మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచింది. కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నారు.
★ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, విల్‌జాక్స్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, కరుణ్ శర్మ, సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్, స్వప్నిల్ సింగ్
★ గుజరాత్: సాహా, గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, లిటిల్
Similar News
News December 28, 2024
సంక్రాంతికి ఇంటికెళ్లేవారికి GOOD NEWS
సంక్రాంతికి HYD నుంచి APకి వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు APSRTC ప్రకటించింది. JAN 9 నుంచి 13 మధ్య ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని పేర్కొంది. MGBSలో రద్దీని తగ్గించేందుకు JAN 10-12 మధ్య కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులను CBS గౌలిగూడ నుంచి నడిపిస్తామంది.
News December 28, 2024
పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి!
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి కలకలం రేపాడు. పోలీసు అధికారిలా యూనిఫాంతో హడావుడి చేయగా అనుమానం వచ్చిన కొందరు అతనిపై ఫిర్యాదు చేశారు. అతడిని విజయనగరం జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఐపీఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 28, 2024
డాలర్ వెపన్‌ను బిట్‌కాయిన్‌తో నిర్వీర్యం చేసిన పుతిన్
వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు, డాలర్ ఆయుధీకరణను అడ్డుకొనేందుకు రష్యా దీటైన పథకమే వేసింది. ఒకప్పుడు వ్యతిరేకించిన డిజిటల్ కరెన్సీనే అనుకూలంగా మలుచుకుంది. ఇతర దేశాలు, గ్లోబల్ కంపెనీలకు బిట్‌కాయిన్ల ద్వారా చెల్లింపులు చేపట్టింది. వీటి మైనింగ్, పేమెంట్లకు మద్దతుగా పుతిన్ చట్టాలు తీసుకొచ్చారు. డీసెంట్రలైజ్డ్ కరెన్సీ కావడమే BTC ప్లస్‌పాయింట్. యుద్ధం చేస్తున్నా రష్యా మెరుగైన GDP సాధించడానికి ఇదే కారణం.