News March 7, 2026
ADB: జర జాగ్రత్త..!

మార్చి నెలలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో 38.7, ఆదిలాబాద్ 38.6, నిర్మల్ 38.6, కొమురం భీమ్ జిల్లాలో 38.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Similar News
News March 9, 2026
సిద్దిపేట: ప్రజా పాలన కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించాలి: కలెక్టర్

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 99 రోజులు చురుగ్గా నిర్వహించాలని కలెక్టర్ కే.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో ప్రభావవంతంగా అమలు చేయాలని సూచించారు.
News March 9, 2026
భవిష్యత్తులోనూ తప్పులు జరగకుండా పాస్ పుస్తకాలు: సీఎం

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని CM CBN చెప్పారు. YCP హయాంలో జరిగిన తప్పులను సరిదిద్ది QR కోడ్‌తో పారదర్శకంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. నంద్యాల(D) కొత్తబురుజులో రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భవిష్యత్తులోనూ ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని తెలిపారు.
News March 9, 2026
అనకాపల్లి: నాటు తుపాకీ కాల్పులతోనే బాలుడు మృతి

ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో అనుమానదస్పదంగా మరణించిన కౌశిక్ నాటు తుపాకీ కాల్పులతో చనిపోయాడనే వాదన బలంగా వినిపిస్తోంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి నాటు తుపాకితో అడవిలో వేటాడే అలవాటు ఉంది. ఆ వ్యక్తి కుమారుడు, కౌశిక్ ఈ తుపాకితో ఆడుకుంటున్న క్రమంలో తుపాకీ పేలి మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తుపాకీ కాల్చిన బాలుడిని, తండ్రిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం.


