News May 4, 2024
పి.గన్నవరం: 2019లో 10మంది, ఇప్పుడు 13.. గెలుపెవరిది?

2019 ఎన్నికల్లో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి 10మంది పోటీ చేశారు. వారిలో వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో 13 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాలరావు, కూటమి నుంచి గిడ్డి సత్యనారాయణ (జనసేన), కాంగ్రెస్ నుంచి కొండేటి చిట్టిబాబుతో పాటు మరో 10 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.
Similar News
News September 15, 2025
రాజమండ్రి: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న ఓ మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో నలుగురు యువతులు, ఐదుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులతో సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
మంత్రి కందులను కలిసిన తూ.గో కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం విజయవాడలో మంత్రి కందుల దుర్గేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని ప్రధాన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రికి వివరించారు. జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, సినీ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో వేగంగా అభివృద్ధి పనులు చేపడతామని కలెక్టర్ తెలిపారు.
News September 15, 2025
తూ.గో: నేడు కలెక్టరేట్‌లో PGRS

రాజమండ్రి కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని కూడా సూచించారు.