News March 7, 2026

HYD: తెలుగువర్సిటీలో జ్యోతిష ఝరి

image

HYD తెలుగు విశ్వవిద్యాలయం NTR ఆడిటోరియంలో నిర్వహించిన రసఝరి కార్యక్రమంలో వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యతను వివరించారు. ఖగోళ గ్రహాల గమనాలపై నిషిత అధ్యయనం, కచ్చితమైన కాలనిర్ణయంతో జ్యోతిషం శాస్త్రీయ ప్రమాణంతో ఉండాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన శతదిన విద్య ప్రణాళికలో భాగంగా జరిగిన కార్యక్రమంలో జ్యోతిష శాఖ విద్యార్థులు ‘దారిదీపం’ నాటకాన్ని ప్రదర్శించారు.

Similar News

News April 10, 2026

రాజమండ్రి ప్రజలకు గుడ్‌న్యూస్

image

రాజమండ్రి విమానాశ్రయం నుండి హైదరాబాద్‌కు Fly91 నూతన విమాన సర్వీసును రుడా (RUDA) ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ నూతన విమాన సర్వీస్ ద్వారా నగరం నుంచి కనెక్టివిటీని పెంచడంతో పాటు వ్యాపార, వాణిజ్య & పర్యాటక రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజమండ్రిని రవాణా పరంగా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.

VZM: స్నేహితుని మరణానికి కారణమైన వ్యక్తి అరెస్టు

image

ఓ యువకుడి మరణానికి కారణమైన అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 28న తుమ్మకాపల్లి పంచాయతీ జనార్ధన లేఔట్‌లో రాజపాత్రునిపాలెంకి చెందిన వానపల్లి సోమేశ్వరరావు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కొత్తవలస పోలీసులు జరిపిన విచారణలో కంచరాన అశోక్ కుమార్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. కొత్తవలస కోర్టు నిందితుడికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ ఇచ్చినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు.