News May 4, 2024
ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు ఒక రోజు సెలవు
AP: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వేసేందుకు ఈసీ ఒకరోజు సాధారణ సెలవును మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఉద్యోగుల అభ్యర్థన మేరకు సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. సంబంధిత విభాగాల అధిపతులు, కలెక్టర్లు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News December 28, 2024
మన్మోహన్‌కు స్మారకమా? మరి నా తండ్రికెందుకు అడగలేదు: ప్రణబ్ కుమార్తె
మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకం కోసం PM మోదీని ఖర్గే కోరడాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ విమర్శించారు. పార్టీకి సేవలందించి, రాష్ట్రపతిగా పనిచేసిన తన తండ్రి చనిపోతే వాళ్లు స్మారకమే అడగలేదన్నారు. కనీసం CWC మీటింగ్ పెట్టి సంతాపం ప్రకటించలేదని ఆరోపించారు. ఇవన్నీ ప్రధానులకే అని ఒకరు చెప్పగా KR నారాయణన్‌కు CWC సంతాపం ప్రకటించడాన్ని తన తండ్రి డైరీస్ ద్వారా తెలుసుకున్నానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
News December 28, 2024
సంక్రాంతికి ఇంటికెళ్లేవారికి GOOD NEWS
సంక్రాంతికి HYD నుంచి APకి వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు APSRTC ప్రకటించింది. JAN 9 నుంచి 13 మధ్య ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని పేర్కొంది. MGBSలో రద్దీని తగ్గించేందుకు JAN 10-12 మధ్య కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులను CBS గౌలిగూడ నుంచి నడిపిస్తామంది.
News December 28, 2024
పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి!
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి కలకలం రేపాడు. పోలీసు అధికారిలా యూనిఫాంతో హడావుడి చేయగా అనుమానం వచ్చిన కొందరు అతనిపై ఫిర్యాదు చేశారు. అతడిని విజయనగరం జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఐపీఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.