News May 4, 2024
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రవాదుల దాడి

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. సురన్‌కోట్‌లో వాహనాలపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు అక్కడ భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. చాలా రోజులుగా అక్కడ పాక్ స్పాన్సర్డ్ టెర్రరిస్టుల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి.
Similar News
News March 13, 2026
మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు UPSC నోటిఫికేషన్

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కింద వివిధ ప్రభుత్వ విభాగాల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,358 పోస్టులు కాగా ఇందులో సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో 864 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు రైల్వే, ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, ఢిల్లీ కార్పొరేషన్‌లో 494 ఖాళీలు ఉన్నాయి. UPSC <
News March 13, 2026
ప్రెగ్నెన్సీలో కాస్మెటిక్స్ వాడితే ఏమవుతుందంటే?

ప్రెగ్నెన్సీ సమయంలో గాఢ రసాయనాలుండే పెర్‌ఫ్యూమ్‌లు, రూమ్ ఫ్రెషనర్లు, కాస్మెటిక్స్ వాడటం వల్ల ఎండోక్రైన్ సిస్టంపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. వీటివల్ల బిడ్డ పుట్టుకలో లోపాలు, ట్యూమర్లు, అండంలో పెరుగుదల లోపాలు వంటివి జరగవచ్చంటున్నారు. కొన్నిసార్లు అబార్షన్ కూడా అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏవైనా వాడేముందు అందులో ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
News March 13, 2026
జంతువుల కొవ్వు కలిసిందనడానికి మీరేమైనా నిపుణులా: సుప్రీంకోర్టు

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారని, ఈ దిశగా CBI దర్యాప్తు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో జంతువుల కొవ్వు కలిసిందనడానికి మీరేమైనా నిపుణులా? అని CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఏవైనా ఆధారాలుంటే CBIకి ఇవ్వాలని సూచిస్తూ కేసు విచారణను ముగించారు.


