News March 7, 2026
టీయూలో హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు

టీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు (పురుషులు, మహిళలు) యూనివర్సిటీ ప్లేగ్రౌండ్‌లో శనివారం హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలను ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్, ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబు ప్రారంభించారు. స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్ మాట్లాడుతూ.. ఈ నెల 15న తమిళనాడు, 17న కేరళలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనే విద్యార్థులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
మన్యం జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ..

పార్వతీపురం జిల్లాలోని 443 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 9,72,195 మంది ఓటర్లు నమోదవ్వగా వీరిలో 4,77,857 మంది పురుషులు, 4,94,338 మంది మహిళలున్నారు. పార్వతీపురం మండలంలో అత్యధికంగా 28,449 మంది ఓటర్లు ఉన్నారు. భామిని మండలంలో అత్యల్పంగా 10,429 మాత్రమే నమోదయ్యారు. త్వరలో పంచాయతీ కార్యాలయాల్లో జాబితాలను ప్రదర్శించనున్నారు.
News April 17, 2026
అపార్టుమెంట్లలో EV ఛార్జింగ్ పాయింట్లు

TG: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా GOVT, PVT భాగస్వామ్యంలో మరిన్ని EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని CS రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. EVల సంఖ్య పెరుగుతున్నందున గ్రామీణ, పట్టణ ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటి మ్యాపింగ్‌కు డ్యాష్ బోర్డును అభివృద్ధి చేయాలన్నారు. నగరాల్లోని అపార్టుమెంట్లలో ఈ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరి చేయనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.
News April 17, 2026
గంగ జాతరకు CM చంద్రబాబుకు ఆహ్వానం

కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు సతీసమేతంగా రావాలంటూ CM చంద్రబాబుకు గంగమ్మ గుడి ఛైర్మన్ BMK రవిచంద్రబాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. అమరావతిలో CMను ఆయన నివాసానికి వెళ్లి జాతర ఆహ్వాన పత్రిక ఇచ్చారు. గంగ జాతరలో భాగంగా మే 20న అమ్మవారి విశ్వరూప దర్శనం రోజు CM చంద్రబాబు దంపతులు రానున్నట్లు సమాచారం.


