News May 4, 2024
VZM: జిల్లాలో 18,631 పోస్టల్ బ్యాలెట్లు

జిల్లాలో 18,631 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. బొబ్బిలి నియోజక వర్గంలో 2105 మంది , చీపురుపల్లిలో 1405 మంది, గజపతినగరం లో 1665 మంది, నెల్లిమర్ల లో 1525 మంది , విజయనగరంలో 3975 మంది, శృంగవరపుకోట (అసెంబ్లీ)లో 1776, రాజాంలో 1741 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News March 11, 2026
VZM: మహిళతో పెళ్లికి నిరాకరణ..ఏడాది జైలు శిక్ష

మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడు బండి సుచిత్‌కు మహిళా కోర్టు బుధవారం ఏడాది శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. బూర్లిపేటకు చెందిన మహిళతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాక మొహం చాటేశాడనే మహిళ ఫిర్యాదుతో కేసును కోర్టుకు అప్పగించగా..శిక్ష ఖరారైందని విజయనగరం మహిళా పీఎస్ డీఎస్పీ ఆర్. గోవిందరావు మీడియాకు తెలిపారు.
News March 11, 2026
VZM: ఇన్‌స్టాగ్రామ్ లవ్..చివరికి జైలు పాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను మోసం చేసిన కేసులో కొండవెలగాడ గ్రామానికి చెందిన నిందితుడు పంది నారాయణ (24)కు పోక్సో ప్రత్యేక కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానాను బుధవారం విధించింది. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నెల్లిమర్ల PSలో నమోదైన ఈ కేసులో నేరం నిరూపితమవడంతో కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు.
News March 11, 2026
VZM: సీఎం సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 6వ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. తొలి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాంధ్ర, GSDP లక్ష్యాలు, జిల్లాల్లో అమలవుతున్న విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీఎస్, సుపరిపాలనలో సాంకేతికత వినియోగం, పెట్టుబడులపై చర్చించారు.


