News May 4, 2024
ఫ్రీ బ్యాగేజీ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఫ్రీ బ్యాగేజీపై ఉన్న గరిష్ఠ పరిమితిని తగ్గించింది. తక్కువ ధర టికెట్ ప్రయాణాలకు బ్యాగేజీ పరిమితిని 20 కేజీల నుంచి 15 కేజీలకు కుదించింది. ఎకానమీలో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీ టికెట్లతో ప్రయాణం చేసే వారికి ఇది వర్తించనుంది. ఈ నిబంధన ఈనెల 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. కాగా కనీసం 15కేజీల వరకు బ్యాగేజీని ఫ్రీగానే అనుమతించాలని డీజీసీఏ నిబంధనల్లో ఉంది.
Similar News
News November 6, 2025
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: టిప్పర్ యజమాని

మీర్జాగూడ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని <<18186628>>టిప్పర్<<>> యజమాని లక్ష్మణ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బస్సు డ్రైవర్ వేగంగా వస్తూ గుంతను తప్పించబోయి మాపైకి దూసుకొచ్చాడు. వెంటనే డ్రైవర్ ఆకాశ్ నన్ను నిద్రలో నుంచి లేపాడు. క్షణాల్లోనే బస్సు మా టిప్పర్‌ను ఢీకొట్టింది. మా డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపాడని, గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు’ అని తెలిపారు.
News November 6, 2025
కరివేపాకుతో మెరిసే చర్మం

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. * కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. * కరివేపాకు మరిగించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.
News November 6, 2025
డెయిరీఫామ్‌తో రూ.15 లక్షలు నష్టపోయారు..

TG: రెండేళ్ల క్రితం డెయిరీఫామ్ ప్రారంభించి రూ.15లక్షలుపైగా నష్టపోయారు కామారెడ్డి(D) పెద్దమల్లారెడ్డికి చెందిన ఐదుగురు మిత్రులు. రూ.27 లక్షల పెట్టుబడి, 17 గేదెలతో ఫామ్ ప్రారంభించారు. గేదెల ఎంపికలో తప్పులు, అనుభవలేమి, ఊహించని ఖర్చులతో 6 నెలల క్రితం ఫామ్ మూసేశారు. అందుకే డెయిరీఫామ్ పెట్టేముందు పూర్తిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ✍️ పాడి, వ్యవసాయ సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


