News May 4, 2024

తూ.గో: మరో 8 రోజులే.. ఇక వారి ఓట్లే టార్గెట్!

image

పోలింగ్ తేదీ ముంచుకొస్తుండటంతో ఉమ్మడి తూ.గో జిల్లా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ప్రతి ఓటు కీలకమేనంటూ వలస ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారి వివరాలు సేకరిస్తూ వారితో టచ్‌లోకి వెళ్తున్నారట. పోలింగ్ రోజు ఓటేసేలా రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు.

Similar News

News July 9, 2025

రాజమండ్రి ప్రభుత్వ సంగీత పాఠశాల ప్రిన్సిపల్‌గా శ్రీనివాస శర్మ

image

రాజమండ్రిలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపల్‌గా పసుమర్తి శ్రీనివాస శర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన కుమారి మండపాక నాగలక్ష్మి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు పదోన్నతిపై బదిలీ అయ్యారు. శ్రీనివాస శర్మ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

News July 9, 2025

రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. డి.ఇ.ఓ. కె.వాసుదేవరావు ఆధ్వర్యంలో 100 మంది శాశ్వత సభ్యులు రెడ్ క్రాస్‌లో చేరారు. వీరికి సంబంధించిన రూ.1,10,000 చెక్కును జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు పి. ప్రశాంతి ద్వారా తూర్పు విభాగం రెడ్ క్రాస్ ప్రతినిధి మహాలక్ష్మికి అందజేశారు.

News July 9, 2025

రాజమండ్రి: ఆర్టీసీలో 9 మందికి కారుణ్య నియామకాలు

image

ఉమ్మడి తూ.గో జిల్లా‌లో మంగళవారం ఆర్టీసీలో కారుణ్య నియామకాలు జరిగాయి. సహజ మరణాలతో పాటు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు ఈ నియామకాలు జరిగాయి. స్థానిక ఆర్ఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తూ.గో జిల్లా డీపీటీవో వై‌ఎస్‌ఎన్ మూర్తి , కాకినాడ డీపీటీవో ఎం. శ్రీనివాసరావు, కోనసీమ డీపీటీవో రాఘవ కుమార్‌లు పాల్గొని 9 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.