News May 4, 2024
TS SET నోటిఫికేషన్ విడుదల

ఓయూ ఆధ్వర్యంలో నిర్వహించే TS SET నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 14 నుంచి జులై 2 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 20 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం ఉంటుంది. అదే నెల 28 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ప్రభుత్వం TS SETను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
Similar News
News September 16, 2025
వివేకా హత్య కేసు: బెయిల్ రద్దుపై జోక్యం చేసుకోలేమన్న SC

AP: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ సునీత వాదనపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ వేయాలని సూచించింది. పిటిషన్ వేసిన 8 వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని, ట్రయల్ కోర్టును ఆదేశించింది.
News September 16, 2025
కూతురు మృతి.. హీరో ఎమోషనల్ కామెంట్స్

చనిపోయిన తన కూతురు మీరాను మిస్సవ్వడం లేదని, ఆమె ఇంకా తనతోనే ఉన్నట్లు భావిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. ‘నేను కూతుర్ని కోల్పోలేదు. ఆమె నాతోనే ప్రయాణిస్తోంది. ఆమెతో రోజూ మాట్లాడుతున్నా. ఇందులో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరా రెండేళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకోగా, తానూ ఆమెతోనే చనిపోయానని ఆ సమయంలో విజయ్ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.
News September 16, 2025
భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.