News May 4, 2024

MTM : బాలశౌరి, కొల్లు రవీంద్రపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

image

మచిలీపట్నం కూటమి MP, MLA అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రపై వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వారిద్దరూ ఈ నెల 2న మచిలీపట్నం పోలీస్ స్టేషన్, జిల్లా ఎస్పీ ఆఫీస్ వద్ద వందలాది మంది కార్యకర్తలతో ధర్నా చేసిన దానిపై ఎన్నికల సంఘం రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి ఇరువురిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News October 1, 2024

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 4,72,512 మందికి పింఛన్లు

image

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,72,512 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక డాష్‌బోర్డు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,33,248 మందికి రూ.99,45,900,00, కృష్ణా జిల్లాలో 2,39,264 మందికి రూ.1,01,50,95,000 అక్టోబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

News September 30, 2024

విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబును సోమవారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అధికారులు, మంత్రితో కలసి చంద్రబాబుకు అమ్మవారి ప్రసాదం, ఆహ్వానపత్రిక అందజేశారు.

News September 30, 2024

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి స్వీకరించిన సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూసినప్పుడే ప్రజలు సంతృప్తికరంగా ఉంటారన్నారు.