News May 4, 2024
ట్రక్కు వెనుక ట్రక్కు పెట్టి.. రైళ్లు పరిగెత్తి! -1/2

దేశంలో సరకు రవాణా చేయడంలో ట్రక్కులది కీలక పాత్ర. అయితే ఈ సరకు రవాణా ట్రక్కులను రైళ్ల ద్వారా గమ్యస్థానానికి చేరిస్తే? ప్రస్తుతం పలు చోట్ల అమలులో ఉన్న ఈ స్కీమ్ త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనుంది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) ఈ సేవలను అందిస్తోంది. 2006లో కేంద్రం ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇప్పుడు RORO (రోల్ ఆన్ రోల్ ఆఫ్) సేవలను విస్తరించడంపై దృష్టి సారించింది.
Similar News
News February 3, 2026
ఇది ప్రజాస్వామ్యంపై మాయని మచ్చ: రాహుల్ గాంధీ

ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగంలో దేశ భద్రత ముఖ్యమైన అంశమని, దీనిపై సభలో మాట్లాడనివ్వకుండా హక్కులను కాలరాశారని విమర్శించారు. ఓ ప్రతిపక్ష నేతకు ఇలా జరగడం పార్లమెంటు చరిత్రలో తొలిసారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంపై ఒక మాయని మచ్చ అని లేఖలో పేర్కొన్నారు.
News February 3, 2026
ఏప్రిల్ 3న శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్

శర్వానంద్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. అభిలాష్ రెడ్డి కంకర డైరెక్షన్‌లో UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్. ఇప్పటికే రిలీజైన ‘ఫస్ట్ ల్యాప్’ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. జిబ్రాన్ మ్యూజిక్ ఈ రేసింగ్ థ్రిల్లర్‌కు స్పెషల్ అట్రాక్షన్.
News February 3, 2026
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

TG: జగిత్యాల(D) మొగిలిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు రైతు కూలీలు స్పాట్‌లోనే చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు మెట్‌పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


