News May 4, 2024

విశాఖలో రామోజీరావుపై ధ్వజమెత్తిన మంత్రి బొత్స

image

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఇష్టం వచ్చినట్లు కథనాలు రాసిన ఈనాడు రామోజీరావుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘మా భూమి మాది కాకపోతే మరెవరిది’ అంటూ రామోజీరావును ప్రశ్నించారు. అన్నం తినే వాళ్ళు ఎవరూ ఇలాంటివి రాయరని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందడం కోసమే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని విమర్శించారు. ఈ చట్టం రాష్ట్రంలో అమల్లో లేదన్నారు.

Similar News

News March 15, 2026

విశాఖ: టెన్త్ పరీక్షలు రాసేవారికి బస్సులో ఉచిత ప్రయాణం

image

పదో తరగతి పరీక్షల దృష్ట్యా, విద్యార్థులు హాల్ టికెట్ చూపి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రకటించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News March 15, 2026

గ్యాస్ కోసం ఆందోళన అవసరం లేదు: విశాఖ జేసీ

image

విశాఖ జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ విద్యాధరి ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ బుకింగ్‌నకు రోజువారీ అవసరము 18,184 సిలిండర్‌లు కాగా 37,920 సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్ బుకింగ్ చేసుకోవాలనన్నారు. కేవలం పుకార్ల వల్ల మాత్రమే బుకింగ్స్ పెరిగాయని ఆమె పేర్కొన్నారు.

News March 15, 2026

విశాఖలో రేపు PGRS

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.