News March 8, 2026
KMR: మహిళే ఓదార్పు

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ.. పురుషుల్లోని క్రూరత్వం మానవత్వాన్ని చంపేస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఓ చోట అత్యాచారం, మరోచోట పెత్తనంతో హత్యాచారం, ఇంకోచోట పిల్లలను కడతేర్చే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళలకు గౌరవం దక్కుతుందే తప్పా మిగతా రోజులు మిథ్యగానే మారుతున్నాయి.
Similar News
News March 8, 2026
ఓల్డ్ ఏజ్ హోమ్స్ తగ్గించేలా కృషి చేయాలి: కలెక్టర్

సమాజంలో వృద్ధాశ్రమాల సంఖ్య తగ్గించేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోమటి చెరువు వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రతి ఇంటి బాధ్యతను మోసే మహిళలు, తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బాధ్యతల నిర్వహణే మనలో పోరాట పటిమను పెంచుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పురపాలక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
News March 8, 2026
యాదాద్రి: ప్రియుడు మోసం చేశాడని యువతి సూసైడ్

ప్రియుడు మోసం చేశాడన్న మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో చోటుచేసుకుంది. మండలానికి చెందిన యువతి (28), అదే మండలానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ప్రేమ వివాహం విషయంలో అతను మోసం చేయడంతో మనస్తాపం చెందిన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 8, 2026
తూ.గో: ఒకే ఘటన.. 11 మంది మృతి

రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఆదివారం ఎస్. రామలక్ష్మి (73) మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం మరో 9 మంది వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితుడు గణేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.


