News March 8, 2026
యంగ్ సైంటిస్ట్ ఎక్స్‌పోలో తెల్లాపూర్ విద్యార్థుల సత్తా

నిర్మాణ్ యంగ్ సైంటిస్ట్ ఎక్స్‌పోలో రామచంద్రపురం మండలం తెల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు అదరగొట్టారు. మాదాపూర్‌లో జరిగిన పోటీల్లో వీరు రూపొందించిన ‘ఆల్కహాల్ డిటెక్టర్’ ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం దక్కినట్లు హెచ్ఎం భాస్కర్ తెలిపారు. 7వ తరగతి విద్యార్థులు కార్తీక్, శ్రీరామ్, 8వ తరగతి విద్యార్థులు శివానంద్, అగ్నిమణి ప్రతిభను ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News March 21, 2026
నాగార్జునసాగర్, మూసీకి తగ్గిన నిధులు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పనులకు బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులను భారీగా తగ్గించింది. గతేడాది రూ.297.95 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ.196.85 కోట్లకే పరిమితం చేసింది. ఈ నిధులతోనే డ్యాం, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టాల్సి ఉంది. అలాగే గతంలో మంజూరు చేసిన 15 ఎత్తిపోతల పథకాల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదు. ఇక మూసీ ప్రాజెక్టుకు గతేడాది రూ.50 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.30.15 కోట్లకు కుదించింది
News March 21, 2026
ఎచ్చెర్ల: పరీక్షలు రాస్తారు.. ఫలితాలు మాత్రం ఎప్పటికో..!

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పరీక్షల ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహణ తర్వాత కనీసం 30 నుంచి 45రోజుల వరకు ఫలితాలు వెల్లడికి పడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. రీ వాల్యుయేషన్ ఫలితాలు రావడంలో, సర్టిఫికెట్స్ అందజేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో ఆందోళన చెందుతున్నామని అంటున్నారు.
News March 21, 2026
HYD: భట్టి కుమారుడి రిసెప్షన్‌లో సీఎం దంపతులు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య- సాక్షి వివాహ రిసెప్షన్ HYD శివారులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను రేవంత్ రెడ్డి దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు, సినీ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.


