News May 4, 2024
శ్రీకాకుళం: డా.బిఆర్ఏయూ పరీక్ష తేదీల్లో మార్పు

ఎచ్చెర్ల డా.బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సప్లిమెంటరీ 2, 4 సెమిస్టర్ల సప్లిమెంటరీ పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు డా.బిఆర్ఏయూ పరీక్షల విభాగం డీన్ డా.ఎన్.ఉదయభాస్కర్ శనివారం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ 17, 18వ తేదీల్లో జరుగుతాయని, డిగ్రీ నాలుగో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News July 10, 2025
మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత: SP

మహిళలు భద్రతకు జిల్లా పోలీసుశాఖ మొదటి ప్రాధాన్యత, బాధ్యతగా తీసుకుంటుందని SP మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో నారీశక్తి కార్యక్రమం పేరిట మహిళల భద్రతపై విస్తృత స్థాయిలో పట్టణ, గ్రామీణ ప్రజానీకానికి, జిల్లాలో గల పోలీస్ స్టేషన్ ద్వారా చైతన్యవంతం చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
News July 9, 2025
రేపు జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలను రేపు కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి.లక్ష్మణ్ దేవ్ ప్రకటించారు. ఆండర్-13, 14 విభాగాల్లో సత్తాచాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. 2011-12 సంవత్సరాల మధ్య జన్మించిన క్రీడాకారులు పోటీలకు అర్హులని తెలిపారు.
News July 9, 2025
కిక్కిరిసిన పలాస-ఆమదాలవలస ట్రైన్

పలాస-ఆమదాలవలస ప్యాసింజర్ రైలు బుధవారం ప్రయాణికులతో సంద్రాన్ని తలపించింది. సింహాచలం గిరి ప్రదర్శన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు సింహాచలం తరలి రావడంతో రైలు ప్రయాణికులతో కిటకిటలాడింది. ట్రైన్‌లో కనీసం కాలు పెట్టుకునేందుకు కూడా చోటు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డామన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం స్పెషల్ ట్రైన్స్ వేయాలని కోరారు.