News March 8, 2026
కోచ్‌గా గంభీర్.. విమర్శకుల నోళ్లు మూయిస్తారా?

టీమ్ ఇండియా కోచ్‌గా ప్రశంసల కంటే <<18976802>>విమర్శలనే<<>> గంభీర్ ఎక్కువ ఎదుర్కొన్నారు. తన వ్యూహాలు, ఎంపికలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒక్క మ్యాచ్ ఓడినా, అతడు సపోర్ట్ చేసిన ప్లేయర్ రాణించకున్నా విమర్శకుల దండయాత్ర జరిగేది. కానీ వాటిని దాటుకుని, INDను T20 WC ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ సూర్యకు అవసరమైన సలహాలిస్తూ నడిపించారు. మరి ఇంకో గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయిస్తారా? కామెంట్ చేయండి.
Similar News
News April 7, 2026
రూ.39,436 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

AP: రాష్ట్రంలో రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే 31 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేవలం విద్యుత్ రంగంలోనే 8 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు TDP ట్వీట్ చేసింది. వీటి ద్వారా యువతకు 1,11,278 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు పేర్కొంది. అమరావతి క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 16వ SIPB సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించింది.
News April 7, 2026
MI-RR మ్యాచ్ పరిస్థితి ఏంటి?

ఐపీఎల్‌లో MI-RR మ్యాచ్ జరగాల్సిన గువాహటి స్టేడియం వద్ద వాన కాస్త తగ్గింది. చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో కవర్లు తొలగించి, డ్రయర్ వెహికల్స్‌తో ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు సిబ్బంది రెడీగా ఉన్నారు. అయితే వర్షం పూర్తిగా ఆగిన తర్వాతే టాస్ వేయనున్నారు. రాత్రి 10.56 గంటలను కట్ ఆఫ్ టైమ్‌గా నిర్ణయించారు. ఆ సమయానికి మ్యాచ్ స్టార్ట్ అయితే 5 ఓవర్ల గేమ్ ఆడిస్తారు.
News April 7, 2026
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

ట్రంప్ <<19591722>>వార్నింగ్<<>> నేపథ్యంలో USతో థర్డ్ పార్టీ సంప్రదింపులను కూడా ఇరాన్ నిలిపివేసినట్లు అక్కడి మీడియా ప్రకటించింది. ఇక ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఎంబసీలు ఘాటుగా బదులిస్తున్నాయి. మీరు, మీ మిత్రదేశాలకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని ట్రంప్‌ను సౌతాఫ్రికాలోని ఎంబసీ హెచ్చరించింది. కాలం పెట్టిన పరీక్షలకు ఎదురునిలిచిన దేశాన్ని ఓ సైకోపాత్ బెదిరింపులు అంతం చేయలేవని తుర్కియేలోని ఎంబసీ ఫైర్ అయింది.


