News May 4, 2024

మెదక్: తటస్థ ఓటర్లకు పార్టీల గాలం..!

image

పార్లమెంటు ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారారు. దీంతో వీరి ఓట్లను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు? తటస్తులు ఎంతమంది? అన్న కోణంలో ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న  వారిపై దృష్టిసారించారు.

Similar News

News March 14, 2026

మహిళల సాధికారతకు ప్రభుత్వం కృషి: మంత్రి దామోదర

image

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ హాస్పిటల్‌లో ‘షి పవర్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విమెన్స్ కాంక్లేవ్’లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘షి పవర్ మొబైల్ యాప్’ను ఆయన ఆవిష్కరించారు. మహిళా సాధికారతపై జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో వివిధ రంగాల మహిళా నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

News March 14, 2026

మెదక్: ‘ఎస్సీలకు ఆర్థిక సాయం..17లోగా దరఖాస్తు చేసుకోండి’

image

మెదక్ జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి 2025-26 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ. 236.60 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా అధికారి విజయలక్ష్మి తెలిపారు. దీని ద్వారా 249 మందికి లబ్ధి కలగనుంది. ఇందులో 119 ఈవీ బైక్‌లు, 59 ఆటో రిక్షాలు, 12 వ్యవసాయ యూనిట్లు కేటాయించారు. ఆసక్తిగల వారు ఈ నెల 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News March 14, 2026

గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్ నగేష్

image

మెదక్ జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని అదనపు కలెక్టర్ నగేష్ స్పష్టం చేశారు. శుక్రవారం గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వినియోగదారులు సిలిండర్ బుక్ చేసిన 2-3 రోజుల్లోనే డెలివరీ చేసేలా చూడాలని ఆదేశించారు. కమర్షియల్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.