News May 4, 2024

RCB తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

image

GTతో మ్యాచ్‌లో RCB కెప్టెన్ డుప్లెసిస్ రెచ్చిపోయారు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. IPL హిస్టరీలో RCB తరఫున ఇది రెండో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ కావడం విశేషం. 2013లో పుణె వారియర్స్‌పై గేల్ 17 బంతుల్లో, 2010లో పంజాబ్ కింగ్స్‌పై ఉతప్ప 19 బాల్స్‌లో ఫిఫ్టీ బాదారు. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో డుప్లెసిస్ మొత్తంగా 23 బంతుల్లో 64 రన్స్ బాదేశారు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

Similar News

News March 25, 2026

రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురు

image

పశ్చిమాసియాలో సంక్షోభంతో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏకంగా 6 కోట్ల బ్యారెళ్ల చమురు APRలో డెలివరీ కానుందని పేర్కొంది. బ్రెంట్ ధరకు అదనంగా 5-15 డాలర్ల ప్రీమియం రేటుకు కొనుగోలు చేశాయని తెలిపింది. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇతర దేశాలు సైతం భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
*1 బ్యారెల్ అంటే 159 లీటర్లు.

News March 25, 2026

రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

image

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

News March 25, 2026

ఈసారి సిక్సర్ల వీరుడు ఎవరో?

image

ఈసారి IPLలో సిక్సర్ల వర్షం కురవడం ఖాయమని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. ముఖ్యంగా SRHలోని హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసెన్ విరుచుకుపడతారని తెలిపారు. వారితో పాటు శాంసన్ (CSK), అలెన్ (KKR), పూరన్ (LSG), రోహిత్ శర్మ (MI), శివమ్ దూబే (CSK), వైభవ్ సూర్యవంశీ (RR), బ్రెవిస్ (CSK) ఈ రేసులో ముందున్నారు. మరి ఈ సీజన్లో ఎవరు అత్యధిక సిక్సర్లు కొడతారో కామెంట్ చేయండి.