News March 9, 2026
భూపాలపల్లి: ఆనాటి జగన్మోహిని కేశవ విగ్రహం.. నేడే ప్రతిష్ఠాపన

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని జగ్గయ్యపల్లె గ్రామ పరిసర ప్రాంతంలోని వాగులో 12వ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి శిలా విగ్రహం ఇటీవల లభించిన విషయం తెలిసిందే. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విగ్రహాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో జగ్గయ్యపల్లెకి తరలించారు. కాగా, విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం నేడు జగ్గయ్యపల్లెలో ఉ.8 నుంచి మ.12 వరకు నిర్వహించనున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు.
Similar News
News March 10, 2026
నిర్మల్: రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం

నిర్మల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం. మంజులాపూర్‌కు చెందిన సృజన్, నటరాజ్ నగర్‌కు చెందిన పృథ్వీరాజ్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. సృజన్ అక్కడికక్కడే మృతిచెందగా, పృథ్వీరాజ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోగా చనిపోయాడు. చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.
News March 10, 2026
SKLM: పశువుల అక్రమ రవాణ.. ఇద్దరిపై కేసు నమోదు

లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని అడ్డుకున్నామని ఎస్సై అప్పలసూరి తెలిపారు. సోమవారం పశువుల వాహనం వెళుతున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్నామని ఆయన వివరించారు. బుడుమూరు వద్ద తనిఖీ చేయగా కోటబొమ్మాళి మండలం నారాయణ వలస సంత నుంచి ఆలమండకు వెళ్తున్నట్లు గుర్తించామన్నారు. కరగాన రాజు, కె.వెంకట్‌లపై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.
News March 10, 2026
నేపాల్‌లో RSP ఘన విజయం.. మోదీ కంగ్రాట్స్

నేపాల్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 165 స్థానాలకు గాను రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 125 చోట్ల గెలిచింది. నేపాలీ కాంగ్రెస్ 18, CPN(UML) 9, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ 7, మిగతా పార్టీలు 5 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఓ చోట రిజల్ట్ పెండింగ్‌లో ఉంది. ఘన విజయం సాధించిన RSP ప్రెసిడెంట్ రవి లామిచానే, ప్రధాని అభ్యర్థి బాలెన్ షాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.


