News March 9, 2026
మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి AIIMS వసతిగృహంలో డయేరియా కలకలం రేపింది. 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై చికిత్స అందిస్తున్నారు. నీటి కాలుష్యమే ఈ పరిస్థితికి కారణమని అనుమానిస్తున్న అధికారులు, హాస్టల్ నుంచి 40 నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు కారణాలు వెల్లడిస్తామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
Similar News
News March 9, 2026
నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు: సంజూ తండ్రి

భారత్ ప్రపంచకప్ గెలవడం ఆనందంగా, గర్వంగా ఉందని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ తెలిపారు. ‘సంజూ కోసం దేశంలో చాలా మంది ప్రార్థించారు. ఇప్పుడు వారంతా సంతోషంగా ఉంటారు. సెమీఫైనల్లో 250 రన్స్ చేసినా మనం 6-7 రన్స్ తేడాతోనే గెలిచాం. నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు. దాని కోసం 1-2 బాల్స్ కూడా మిస్ చేయకూడదు’ అని చెప్పారు.
News March 9, 2026
పాలమూరు: ఉచిత శిక్షణ.. ఫోన్ చేయండి

MBNRలోని రాజేంద్రనగర్‌లో DDU-GKY & స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ రవికుమార్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. టెన్త్ పాసైన వారు అర్హులని, ఎంపికైన వారికి ఉచిత శిక్షణతోపాటు వసతి, భోజనం, మెటీరియల్ సదుపాయం కల్పిస్తామని, ఈనెల 20లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాల కోసం 99496 98592కు సంప్రదించాలన్నారు.
SHARE IT
News March 9, 2026
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ధరలు ఇలా..!

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం ధరలు వెలువడ్డాయి. పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,149, వేరుశనగ గరిష్ఠ ధర రూ.8,800, ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,994 పలికాయి. శనగలు గరిష్ఠ ధర రూ 5,061, కందులు గరిష్ఠ ధర రూ. 7,257 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు గడువు ముగియడంతో కేంద్రాలు మూతపడి, పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. వేరుశనగ ధరలు వారం రోజులుగా పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


