News March 9, 2026
ASF: ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు: కలెక్టర్

ASF జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరచిన గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాం వద్ద 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News April 18, 2026
ఖమ్మం: ఘోర ప్రమాదం.. నుజ్జయిన శరీరం

ఖమ్మం జిల్లా గోపాలపురంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సదరు వ్యక్తి శరీరం నుజ్జునుజ్జయి అవయవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అర్బన్ పోలీసుల సమాచారం మేరకు వెంటనే స్పందించిన ఓ ఫౌండేషన్ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెల్లాచెదురుగా ఉన్న శరీరభాగాలను సేకరించి అంబులెన్స్‌లో మార్చురీకి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
News April 18, 2026
సజ్జలపై హైకోర్టు ఆగ్రహం

వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అనాగరికం అని మండిపడింది. అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణల మీద ఆయనపై దాదాపు 14 కేసులు నమోదయ్యాయి. ఇటీవల తనపై ఉన్న ఉన్న లుక్ ఔట్ సర్క్యులర్(LOC)ను రద్దు చేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు LOCని వెనక్కు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని ఆదేశించింది.
News April 18, 2026
WGL: పాలిసెట్ దరఖాస్తుకు 20 వరకు గడువు

పాలిసెట్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 20 కాగా, అపరాధ రుసుం రూ.100తో 21 వరకు, రూ.300తో 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ బైరీ ప్రభాకర్ తెలిపారు. ప్రవేశ పరీక్ష ర్యాంక్ ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి సీట్లు కేటాయిస్తామని చెప్పారు. మే 13న పరీక్ష ఉంటుందని చెప్పారు. విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.


