News May 4, 2024
HYD: బీజేపీ వస్తే రాజ్యాంగ మనుగడ కష్టం: నారాయణ

కేంద్రంలో బీజేపీ పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి మనుగడ ఉండదని, ప్రజల ఓటు హక్కును కూడా లాగేసుకుంటారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే.నారాయణ ఆరోపించారు. HYD హిమాయత్‌నగర్ మఖ్దుమ్ భవన్‌లో శనివారం సీపీఐ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని అన్నారు.
Similar News
News March 13, 2026
HYD: ఇంటిపై కూరగాయల సాగు నేర్చుకుంటారా?

జంటనగరాల్లో ఇంటి పైకప్పులు, బాల్కనీలో కూరగాయలు పెంచాలనుకునే వారికి ఉద్యానశాఖ శిక్షణ ఇవ్వనుంది. అర్బన్ ఫార్మింగ్ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అర్బన్ ఫార్మింగ్ విభాగం సంచాలకులు రామలక్ష్మి తెలిపారు. ఈ శిక్షణ మార్చి 14న నాంపల్లిలోని ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఉ.10 గంటల నుంచి మ.ఒంటి గంట వరకు జరుగుతుంది. వివరాలకు 8977714411 ఈ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
# SHARE IT
News March 13, 2026
HYD: శ్రీలంక టూర్‌కి కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టుకు అనుమతి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టుకు శ్రీలంక పర్యటనకు అనుమతి లభించింది. తెలంగాణ జిల్లాల నుంచి ఎంపికైన యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం కల్పించడానికి ఈ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. టీమ్‌తె కోచ్ GS రాజు, మేనేజర్ వెంకటేశ్వరరావు, అబ్జర్వర్ శ్రీనివాస్ ఉంటారు. గ్రాస్‌రూట్ స్థాయిలో క్రికెట్ అభివృద్ధి చెందేలా చేయడం లక్ష్యం అంటున్నారు.
News March 13, 2026
HYD: ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సప్లై బంద్!

నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందుల బిల్లులు దాదాపు రూ.80 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాకపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వెంటనే తమ బిల్లులు చెల్లించకపోతే మందుల సరఫరా పూర్తిగా నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.


