News May 4, 2024
HYD: FAKE వాటర్ బాటిల్స్ సీజ్..!

HYD నాంపల్లిలోని బిలాల్ ఐస్ క్రీమ్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఫేక్ వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. అంతేకాక ఎలాంటి లైసెన్స్ లేకుండా క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, నోటీసు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు చేపడితే చట్టపరంగా శిక్ష తప్పదన్నారు.
Similar News
News March 12, 2026
HYD: ఫ్లై ఓవర్ కింద అద్భుతం.. స్పోర్ట్స్ అరేనా సూపర్

నగర యువతకు అదిరిపోయే శుభవార్త. మైదానాల కొరతతో ఆటలకు దూరమవుతున్న క్రీడా ప్రేమికుల కోసం MMC కార్పొరేషన్ ఒక అద్భుతమైన కానుకను సిద్ధం చేస్తోంది. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ కింద నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని సకల వసతులతో కూడిన రంగురంగుల ‘స్పోర్ట్స్ అరేనా’గా తీర్చిదిద్దారు. పనులు చివరి దశకు చేరుకొన్నాయి. త్వరలోనే ఫ్లైఓవర్ నీడన ఆటలు ఆడుకోవచ్చు. నగరంలోని అన్ని ఫ్లై ఓవర్ల కింద ఇలా చేస్తే బాగుంటుంది. మీ కామెంట్?
News March 12, 2026
HYD: గ్యాస్ లేకపోతే ఈ ఆలోచన మీకు రాదా?

రూ.5కే కడుపు నింపుతున్న సంస్థలు స్టీమ్ బాయిలర్లు వాడుతుంటే.. వేలల్లో బిల్లులు వసూలు చేసే 5 స్టార్ హోటళ్లు, హాస్టళ్లు గ్యాస్ వాడుతున్నాయి. గ్యాస్ ధర పెరిగిందని కస్టమర్ల జేబులు కత్తరించే బదులు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్‌ల స్టీమ్ వంట పద్ధతికి మారితే ఖర్చు తగ్గుతుంది కదా. కార్పొరేట్ హాస్టళ్లు గ్యాస్ సంక్షోభం సాకుతో మెస్ ఛార్జీలు పెంచడం కరెక్టేనా? గ్యాస్ లేకపోతే.. స్టీమ్ బాయిలర్లు ఉన్నాయి. <<19364190>>సోచో జరా!<<>>
News March 12, 2026
HYDలో గ్యాస్ సెగ.. రూ.5 ‘బువ్వే దిక్కు’

నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2100 దాటి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. హోటళ్లలో ప్లేట్ మీల్స్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే లక్షలాది మంది విద్యార్థులు, కార్మికులకు రూ.5 భోజనం ప్రాణవాయువులా మారింది. గ్యాస్ కష్టాలను అధిగమించడానికి ఈ కేంద్రాల్లో స్టీమ్ ఆధారిత వంట పద్ధతులను వాడుతున్నారు. గతంలో 150 ఉన్న యూనిట్లు ఇప్పుడు దాదాపు 170కి పెరగడం డిమాండ్‌కు నిదర్శనం.


