News March 9, 2026

విశాఖలో మహిళా శక్తి: రాయగడకు ‘ఆల్ ఉమెన్ క్రూ’ స్పెషల్ ట్రైన్!

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో మహిళా సాధికారత ప్రతిబింబించింది. భారతీయ రైల్వేలో మహిళల అంకితభావం, నైపుణ్యాన్ని చాటిచెబుతూ విశాఖ నుండి రాయగడ వరకు సోమవారం ‘ఆల్ ఉమెన్ క్రూ’ ప్రత్యేక రైలును అధికారులు ఘనంగా ప్రారంభించారు. లోకో పైలట్ నుండి గార్డ్ వరకు అందరూ మహిళలే కావడం వారి వృత్తిపరమైన శక్తికి నిదర్శనమని, ఇది అందరికీ స్ఫూర్తిదాయకమని రైల్వే అధికారులు తెలిపారు.

Similar News

News March 11, 2026

మరికల్ : వాహనాల దారి మళ్లింపు.. ప్రయాణికుల అవస్థలు

image

కర్ణాటకలో కుల సంఘాల బంద్‌ పిలుపు నేపథ్యంలో మరికల్‌ మండల కేంద్రంలో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. కృష్ణా-మాగనూరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో, రాయచూరు వెళ్లే వాహనాలను నారాయణపేట మీదుగా పంపిస్తున్నారు. మక్తల్‌, మాగనూరు, రాయచూరు వెళ్లే ప్రయాణికులు ఈ మార్పుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

News March 11, 2026

ఆదిలాబాద్: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

image

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల కోసం విషయ నిపుణులతో అవగాహన కార్యక్రమం, రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,888 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 5,443 మంది, బాలికలు 5,445 మంది ఉన్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు జరగనున్నాయి.

News March 11, 2026

WGL: చారిత్రక కట్టడాలకు జాతీయ గుర్తింపు… ఉపాధి అవకాశాలు!

image

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉన్న స్మారక కట్టడాల సంఖ్య పెరుగుతుండగా, ఉమ్మడి వరంగల్‌లో 6 కట్టడాలు ఉండటం ప్రత్యేకతగా నిలిచింది. దీంతో పర్యాటకుల రాక పెరిగి హోటళ్లు, గైడ్ సేవలు, హస్తకళల విక్రయం వంటి రంగాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గదుల కిరాయిలు, చిరు వ్యాపారులకు కాకతీయ కట్టడాలు వరంగా మారాయని కేంద్రం తీపి కబురు చెప్పినట్లు భావిస్తున్నారు.