News May 5, 2024

అనకాపల్లి: ‘స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలి’

image

స్వేచ్ఛగా ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. శనివారం ఆయన అనకాపల్లి కలెక్టరు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. వివిధ విభాగాల ద్వారా ఎన్నికల ప్రక్రియకు అనుసరిస్తున్న విధానాలపై ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి సుభాష్ వివరించారు.

Similar News

News January 19, 2026

21వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోడి: GVMC

image

పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా జనన రిజిస్టర్‌లో నమోదు చేసుకోలేదా.. మీకోసమే GVMC మరో అవకాశం కల్పించింది. GVMC పరిధిలో ఉన్నవారు ఈనెల 21వ తేదీలోగా జనన రిజిస్టర్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. అన్ని జోనల్ కార్యాలయాల్లోని జనన రిజిస్టర్ అధికారులను సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 22 నుంచి వీరికి రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఉండదన్నారు.

News January 19, 2026

విశాఖ జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి బాధ్యతల స్వీకరణ

image

విశాఖపట్నం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ల విద్యాధరి సోమవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని ఆమె పరిచయం చేసుకున్నారు. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన మయూర్ అశోక్ బదిలీపై గుంటూరు వెళ్లారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.

News January 19, 2026

వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే మెమోలు: కలెక్టర్

image

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. అంతకుముందు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలన్నారు. జీవీఎంసీలో సాధారణ, టౌన్ ప్లానింగ్ వినతులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్‌కి ఆదేశించారు. అలసత్వం వహిస్తే 2 సార్లు మెమోలు ఇవ్వాలని, మూడోసారి ఛార్జి మెమో ఇవ్వాలన్నారు.