News March 10, 2026
4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. వారంలో షెడ్యూల్?

అస్సాం, కేరళ, WB, TN, పుదుచ్చేరి(UT)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. EC వారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం CEC జ్ఞానేశ్ కుమార్ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. స్థానిక పండుగలను పరిగణనలోకి తీసుకోవాలని పలు పార్టీలు ECకి విజ్ఞప్తి చేశాయి. కాగా బెంగాల్‌లో ఎన్నికలను రెండు దశల్లోనే పూర్తి చేయాలని TMC, BJP, INC, CPM, AAP నేతలు కోరారు.
Similar News
News April 18, 2026
HYD: ఫ్యూచర్ సిటీలో మెరిసిపోనున్న వెలుగులు!

ఫ్యూచర్ సిటీ పనులు వేగంగా సాగుతున్నాయి. UGD పనులతో సందడిగా ఉన్న మీర్‌ఖాన్‌పేటలో ఇప్పుడు వెలుగుల పండుగ మొదలైంది. నెట్ ‘0’ లక్ష్యంగా సుమారు రూ.1.49 కోట్లతో భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా 120 అత్యాధునిక LED స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ హితంగా కార్బన్ తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. అభివృద్ధి బాటలో ఈ పల్లె ఇప్పుడు నగర హంగులను సంతరించుకుంటోంది.
News April 18, 2026
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
*అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
*రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం: రాహుల్
*విపక్షాలపై అమిత్ షా, చంద్రబాబు, వైఎస్ జగన్ ఫైర్
*రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు NDA పిలుపు
*హార్ముజ్ ఓపెన్ చేశాం: ఇరాన్
*అంబానీని దాటేసి.. ఆసియా కుబేరుడిగా అదానీ
News April 18, 2026
GT vs KKR.. ఎవరు గెలిచారంటే?

IPL-2026లో KKRకు మరో ఓటమి ఎదురైంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గిల్ 86 పరుగులతో రాణించారు. అంతకుముందు గ్రీన్ 79 రన్స్ చేయడంతో కేకేఆర్ 180 పరుగులు చేయగలిగింది. ఇది GTకి మూడో విజయం కాగా, KKRకు 5వ ఓటమి.


