News May 5, 2024

మే 05: చరిత్రలో ఈ రోజు

image

1818: సోషలిస్టు విప్లవకారుడు కార్ల్ మార్క్స్ జననం
1821: ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ మరణం
1930: టాలీవుడ్ దర్శకుడు పిఠాపురం నాగేశ్వరరావు జననం
1947: హాస్యనటి రమాప్రభ జననం
1963: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జననం
1986: నటి, నిర్మాత విశాఖ సింగ్ జననం
1989: హీరోయిన్ రాయ్ లక్ష్మీ జననం
1995: టాలీవుడ్ నటుడు నాగభూషణం మరణం

Similar News

News January 22, 2026

ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు

image

పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రూల్స్‌ను కఠినం చేసింది. ఏడాదిలో 5సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సును రద్దు లేదా 3 నెలల పాటు సస్పెండ్ చేయనుంది. గతంలో సీరియస్ ఉల్లంఘనల్లో ఇది ఉండేది. కానీ ఇపుడు హెల్మెట్, సీట్ బెల్ట్, రెడ్ లైట్ జంపింగ్ వంటి అంశాలకూ వర్తించనుంది. JAN 1 నుంచే అమల్లోకి తెస్తూ కేంద్రం చట్టాన్ని సవరించింది.

News January 22, 2026

విజయ్ సినిమా పేరే పార్టీ గుర్తు.. ఓటర్లు ‘విజిల్’ వేస్తారా?

image

తమిళ హీరో విజయ్ ‘TVK’ పార్టీకి EC ఇవాళ విజిల్ గుర్తును కేటాయించింది. అయితే ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ‘విజిల్’ పేరిటే ఎన్నికల గుర్తు రావడంతో ఫ్యాన్స్‌తో పాటు కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. రెండింటికీ లింక్ చేస్తూ ‘విజిల్ పోడు’ అని SMలో పోస్టులు పెడుతున్నారు. మూవీ మాదిరే పార్టీ కూడా ఎన్నికల్లో విజిల్ వేసి గెలుస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది సమ్మర్‌లో TNలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.

News January 22, 2026

కాసేపట్లో కేసీఆర్‌ను కలవనున్న కేటీఆర్, హరీశ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల నేపథ్యంలో మాజీ CM KCRతో KTR, హరీశ్ రావు భేటీ కానున్నారు. కాసేపట్లో వారిద్దరూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలా ముందుకెళ్లాలనే దానిపై గులాబీ బాస్‌తో చర్చించనున్నారు. ఇప్పటికే హరీశ్‌ను సిట్ విచారించగా రేపు రావాలని KTRకు నోటీసులు ఇచ్చింది. దీనిపై సాయంత్రం 6 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు.