News May 5, 2024
భారత్‌ను రెచ్చగొడుతున్న నేపాల్

చైనాతో అంటకాగుతున్న నేపాల్.. భారత్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. ఆ దేశ రూ.100 నోటుపై వివాదాస్పద మ్యాప్‌ను ముద్రించాలని నిర్ణయించింది. ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలు తమవంటూ నేపాల్ మ్యాప్ తయారు చేసింది. దానినే ఇప్పుడు రూ.100 నోటుపై ముద్రించాలని ప్రయత్నిస్తోంది. కాగా భారత్‌లోని సిక్కీం, పశ్చిమ బెంగాల్, బిహార్, UP, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ సరిహద్దులు పంచుకుంటోంది.
Similar News
News September 17, 2025
మావోయిస్టుల సంచలన ప్రకటన.. ఆయుధాలు వదిలేస్తామని లేఖ

తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి, ఎన్‌కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. CPI మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ స్టేట్‌మెంట్ రిలీజైంది. కాగా అమిత్ షా 2026 మార్చి లోపు భారత గడ్డపై మావోయిస్టులను ఉండనివ్వబోమని డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఇది భద్రతా బలగాలకు అతిపెద్ద విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు.
News September 16, 2025
దేశానికి సంక్షేమం పరిచయం చేసింది NTR: చంద్రబాబు

AP: దేశ రాజకీయాల్లో NTR ఒక సంచలనం అని CM చంద్రబాబు కొనియాడారు. విజయవాడలో సజీవ చరిత్ర-1984 అనే పుస్తకావిష్కరణలో సీఎం పాల్గొన్నారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది NTR అని, ఆయన స్ఫూర్తితో స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని CBN తెలిపారు. అమరావతిలో తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందన్నారు.
News September 16, 2025
వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ ఇదే.. రేపటి నుంచి దరఖాస్తులు

AP: వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి <<17704079>>అప్లై చేసుకోవాలని<<>> ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ఫామ్ రిలీజ్ చేసింది. అందులో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్‌లో రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది.