News May 5, 2024
నేడు ధర్మవరానికి అమిత్ షా, చంద్రబాబు

కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌కు మద్దతుగా ధర్మవరంలో నిర్వహించే బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా, చంద్రబాబు ఆదివారం పాల్గొననున్నారు. ఈ సభకు కూటమి నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చి ధర్మవరం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సత్యకుమార్ పిలుపునిచ్చారు. అటు జాతీయస్థాయిలో మంచిపేరున్న సత్యకుమార్ గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, దేశవ్యాప్తంగా ధర్మవరం పేరు మారుమోగుతుందని బీజేపీ నేతలు తెలిపారు.
Similar News
News March 21, 2026
ముస్లింలు ఆర్థికంగా ఎదగాలి: అనంతపురం ఎంపీ

అనంతపురం అశోక్ నగర్ ఈద్గా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులంతా విద్యావంతులై, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
News March 21, 2026
పరీక్ష వాయిదా: అనంతపురం DEO

రంజాన్ నేపథ్యంలో శనివారం పదో తరగతి విద్యార్థులకు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసిందని డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఆరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష ఉంటుందని.. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 21, 2026
అనంతపురం: గ్యాస్ సరఫరాపై కలెక్టర్ కీలక సూచనలు

అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్ గ్యాస్ సరఫరాపై వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. ఆలమూరులోని గ్యాస్ గోడౌన్, నగరంలోని పవన్ గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసిన ఆయన, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్ అందుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళనతో ఏజెన్సీల వద్దకు రావద్దని, యధావిధిగా ఇంటి వద్దకే డోర్ డెలివరీ జరుగుతుందని భరోసా ఇచ్చారు. అవసరానికి మించి అదనపు బుకింగ్‌లు చేయవద్దన్నారు.


