News May 5, 2024
టీడీపీలో చేరడం లేదు: EX ఎమ్మెల్యే కమలమ్మ

బద్వేలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి చేరుతుందని వస్తున్న కథనాలు అవాస్తవమని ఆమె అనుచరులు తెలిపారు. ఆమె కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని ఏ పార్టీలోకి చేరడం లేదని పేర్కొన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆ పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.
Similar News
News November 13, 2025
19న అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు

కడప వైవీయూ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. బద్వేలు బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి తెలిపారు. క్రీడాకారులు వైవీయూ అనుబంధ కళాశాలల్లో చదివి, 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు అర్హులన్నారు.
News November 13, 2025
కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం.. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న చిన్న సుంకిరెడ్డికి ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల(M) భీమునిపాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.
News November 13, 2025
కడప జిల్లాలో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై విచారణ!

జిల్లాలో 14 అర్బన్ మండలాల్లో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం నాటికి 9,612 ఇళ్ల నిర్మాణాలను ప్రత్యేక యాప్ ద్వారా పరిశీలించారు. వాటి నిర్మాణాల వివరాలు ఫొటోలతో నమోదు చేశారు. YCP ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.


