News May 5, 2024

తూ.గో.: 10th ఫెయిల్.. విద్యార్థిని SUICIDE

image

బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన తూ.గో జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వనలక్ష్మి (15) ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఫెయిల్ అయింది. దీంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు నల్లజర్ల ఏఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 22, 2026

10,897 సిలిండర్లు సిద్ధం.. ఆందోళన వద్దు: JC

image

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ హెచ్చరించారు. ఇప్పటివరకు 42 కేసులు నమోదు చేసి, 114 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎల్పీజీ కొరత లేదని, పంపిణీదారుల వద్ద 10,897 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సరఫరా సజావుగా సాగుతున్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

News March 22, 2026

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: తూ.గో కలెక్టర్

image

తూ.గో జిల్లా రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న PGRS & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.