News May 5, 2024
శ్రీకాకుళం: దివ్యాంగ ఓటర్లు 21,481 మంది

శ్రీకాకుళం జిల్లాలో దివ్యంగా ఓటర్లు 21,481 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో అత్యధికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 31,44 మంది, అత్యల్పంగా ఆముదాలవలస నియోజకవర్గంలో 2,255 ఉన్నారు. శ్రీకాకుళంలో 2,724, నరసన్నపేటలో 2,981, టెక్కలి 2,649, పాతపట్నం 2,380, పలాస 2,573, ఇచ్చాపురం 2,775 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News March 12, 2026
శ్రీకాకుళం: 24 మంది గ్రేడ్-2 వీఆర్వోలకు గ్రేడ్-1 పదోన్నతి

శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న 24 మంది గ్రేడ్ వీఆర్వోలకు గ్రేడ్ వన్ వీఆర్వోలుగా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలను కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యకు పరిష్కార మార్గం చూపిన కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌లకు వీఆర్వోల సంఘ ప్రతినిధులు రాజేష్, అప్పలనాయుడు, రాంజీ ఇతర ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.
News March 12, 2026
శ్రీకాకుళం: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గురువారం తెలిపారు. ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి జిల్లాలో 11,602 కేసులు గుర్తించడమైనదని, జిల్లా మొత్తం మీద 20 బెంచ్‌లు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలో 4 బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
News March 12, 2026
శ్రీకాకుళం: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్

శ్రీకాకుళం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం స్క్వాడ్ పరిశీలనలో కాపీయింగ్ చేస్తున్న ఆరుగురిని డిబార్ చేసినట్లు డీఈవో ఎ.రవి బాబు చెప్పారు. 866 మంది విద్యార్థులకు 755 మంది హాజరు కాగా 111 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణను సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తున్నాయననారు.


