News May 5, 2024
MDK: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

మెతుకు సీమ భగ భగమంటోంది. రోజురోజుకు భానుడు తాపానికి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జనం జలు హడలిపోతున్నారు. రేగోడ్‌లో శనివారం రికార్డు స్థాయిలో 45.1 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 రోజులుగా ఎండ పెరుగుతూ వచ్చింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిన్న వడదెబ్బతో ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News December 28, 2025
పార్లమెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న మెదక్ విద్యార్ధి

పార్లమెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ జిల్లా విద్యార్ధి పాల్గొన్నారు. కేంద్ర విద్యా శాఖ(NCERT) ఢిల్లీచే ఎంపిక చేసి పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొనడానికి పాపన్నపేట మండలం లింగాయపల్లి చీకోడ్ విద్యార్థి ఏ.శివ చైతన్య, ఉపాధ్యాయుడు ఆర్.కిషన్ ప్రసాద్‌ను ఆహ్వానించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల.. విద్యార్థి, ఉపాధ్యాయుడిని అభినందించారు.
News December 28, 2025
RMPT: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు శనివారం కన్నుమూశాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. RMPT మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుర్రం తేజ గౌడ్ మూడు నెలల క్రితం కర్నాల్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తలకి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా శనివారం పరిస్థితి విషమించి మృతి చెందాడు.
News December 27, 2025
MDK: న్యూ ఇయర్ జోష్.. ఎస్పీ కీలక సూచనలు

న్యూ ఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచే జిల్లావ్యాప్తంగా పోలీసుల పహారా మొదలవుతుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు ముమ్మరం చేస్తామని, వేడుకల పేరిట హద్దులు దాటొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


