News March 11, 2026
జాగ్రత్త.. లేపేస్తాం: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే ఇరాన్‌ను మరింత బలంగా దెబ్బతీస్తామని ట్రంప్ హెచ్చరించగా.. దీనిపై ఇరాన్ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ ఘాటుగా స్పందించారు. ‘మీకంటే గొప్పవారే ఇరాన్‌ను ఏమీ చేయలేకపోయారు. జాగ్రత్త.. లేదంటే మీరే లేకుండాపోతారు’ అని ట్రంప్‌ను హెచ్చరించారు.
Similar News
News April 7, 2026
BREAKING: పాకిస్థాన్‌లో లాక్‌డౌన్

తీవ్ర ఆర్థిక సంక్షోభం, యుద్ధం వల్ల ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ప్రభుత్వం ‘స్మార్ట్ లాక్‌డౌన్’ విధించింది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇవాళ్టి నుంచి రా.8 గంటలకే షాపింగ్ మాల్స్, రా.10 గంటలకే బేకరీలు, రెస్టారెంట్లు, దాబాలు, ఫంక్షన్ హాళ్లు మూసివేయాలని పేర్కొంది. పంజాబ్, ఖైబర్ పంఖ్తుఖ్వా, బలూచిస్థాన్, ఇస్లామాబాద్, గిల్గిత్-బాల్టిస్థాన్, PoKలోని ప్రాంతాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.
News April 7, 2026
రేవంత్‌కు విజయన్ ఘాటు రిప్లై

TG CM రేవంత్ <<19584604>>వ్యాఖ్యలపై<<>> కేరళం CM విజయన్ ఘాటుగా స్పందించారు. ‘మన మధ్య పొలిటికల్ విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మీవన్నీ నిరాధార ఆరోపణలు. అతితక్కువ అవినీతి కలిగిన రాష్ట్రంగా కేరళంను నీతిఅయోగ్ గుర్తించింది. 2025 Nov 1న తీవ్ర కరవు జయించిన తొలి రాష్ట్రంగా నిలిచాం. BJPపై మాకేమీ ప్రేమ లేదు. ఆ పార్టీపై పోరాటానికి ఉమ్మడి వేదికగా నిలుస్తున్నాం’ అని సుదీర్ఘ లేఖ రాశారు.
News April 7, 2026
చావుకు మరో ఏడాది దగ్గరయ్యా: ఆర్జీవీ

నేడు తన పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇవాళ నేను చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను. కాబట్టి ఏవో కారణాల వల్ల సంతోషం కలిగితే తప్ప మనం సంబరాలు చేసుకోవద్దు. థాంక్స్’ అంటూ రాసుకొచ్చారు.


