News May 5, 2024
నేడు నీట్ యూజీ పరీక్ష

MBBS, BDS, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే NEET-UG పరీక్ష నేడు దేశ వ్యాప్తంగా జరగనుంది. 24 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాయనుండగా.. ఏపీ నుంచి 70వేల మంది, తెలంగాణ నుంచి 80 వేల మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు దేశంలోని 557 నగరాలు, ఇతర దేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
ALL THE BEST STUDENTS☘
Similar News
News March 4, 2026
యుద్ధంతో వీటి ధరలు పెరుగుతాయ్!

ఇరాన్ వార్‌తో మనదేశంలో కంది, పెసరపప్పు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా, మయన్మార్, కెనడా నుంచి భారత్ ఏటా 5-6 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, అఫ్గాన్ నుంచి వచ్చే జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, కుంకుమపువ్వు, ఆప్రికాట్ సరఫరాపై ప్రభావం పడటంతో వాటి ధరలకూ రెక్కలొచ్చే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి ఫెర్టిలైజర్ సప్లై కూడా నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయి.
News March 4, 2026
Stock Market: ₹9.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇంకా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 1367 pts నష్టపోయి 78,871 వద్ద, నిఫ్టీ 451 pts క్షీణించి 24,414 వద్ద కొనసాగుతోంది. యుద్ధ ప్రభావం మార్కెట్ సూచీలను కిందకు లాగుతోంది. ఈ ఒక్కరోజే ట్రేడింగ్ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు ₹9.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇన్ఫీ, ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో.. టాటా స్టీల్, LT, అల్ట్రాటెక్, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
News March 4, 2026
మంచి మనుసు చాటుకున్న అల్లు అర్జున్!

టాలీవుడ్ సీనియర్ నటి పావలా <<18529362>>శ్యామల<<>>, ఆమె కుమార్తె ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ఫౌండేషన్‌లో ఉంటున్నారు. వీరి ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మానవత్వంతో స్పందించారు. వారి వైద్య & నిత్యావసర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.10 వేలు అందేలా ఏర్పాటు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇబ్బందుల్లో ఉన్న నటికి బన్ని చేసిన సాయంపై ప్రశంసలొస్తున్నాయి.


