News May 5, 2024
KMM: తటస్థ ఓటర్లకు పార్టీల గాలం..!

పార్లమెంటు ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారారు. దీంతో వీరి ఓట్లను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు? తటస్తులు ఎంతమంది? అన్న కోణంలో ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. కాగా, ప్రధానంగా ఖమ్మం జిల్లాపై ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టిసారించారు.
Similar News
News April 6, 2026
రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం మార్కెట్ కమిటీ సభ్యులు సెలవు ప్రకటించారు. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మిర్చి శాఖ కార్యదర్శి సతీష్ కుమార్ సతీమణి అకాల మృతికి చింతిస్తూ మిర్చి శాఖ సభ్యుల కోరిక మేరకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. తిరిగి ఈనెల 8వ తేదీ బుధవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించారని పేర్కొన్నారు.
News April 6, 2026
ముదిగొండ: నేడు ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి నేడు ముదిగొండ మండలంలో పర్యటించనున్నారు. ఎంపీ నిధులతో న్యూ లక్ష్మీపురం, పమ్మి, వల్లభి తదితర గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, బోర్లను ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి జరిగే ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
News April 6, 2026
ఖమ్మం: గాలివాన వచ్చినా విద్యుత్ ఆగదు!

ఖమ్మం జిల్లాలో వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు 5 ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. ఐటీఐ నిపుణులతో కూడిన ఈ బృందాలు ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో అందుబాటులో ఉంటాయి. వీరికి ప్రత్యేక వాహనాలు, పనిముట్లు అందించారు. సమస్య తలెత్తితే వెంటనే 1912 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.


