News March 11, 2026

‘మినిమం బ్యాలెన్స్’ ఫైన్‌లతో ₹19,000 కోట్లు

image

అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే కస్టమర్లపై వేసే ఫైన్ ద్వారా బ్యాంకులు మూడేళ్లలో (2022-23 to 2024-25) ₹19,000 కోట్లు కలెక్ట్ చేశాయి. దీంట్లో ప్రైవేట్ బ్యాంకులు ₹11,000 కోట్లు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ₹8,000 కోట్లు వసూలు చేశాయి. అత్యధికంగా ప్రైవేట్ రంగంలో HDFC (₹3,872Cr), పబ్లిక్ సెక్టార్‌లో PNB (₹1,578Cr) ఆదాయాన్ని ఆర్జించాయి. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది.

Similar News

News April 9, 2026

ఏప్రిల్ 11 నుంచి ‘వాహన్’ రిజిస్ట్రేషన్లు

image

TG: వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు జారీ చేసే VAHAN పోర్టల్ ఏప్రిల్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. RC, డ్రైవింగ్ లైసెన్స్‌లను NextGen mParivahan యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రవాణాశాఖ తెలిపింది. అదనపు సేవలను కూడా దశలవారీగా ఈ యాప్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించింది. మార్చి 23న తాత్కాలికంగా ప్రారంభమైన ఈ పోర్టల్ ఇకపై పూర్తి సేవలను అందించనున్నట్లు తెలిపింది.

News April 9, 2026

మండిన ఎండలు.. 16 మండలాల్లో హై టెంపరేచర్

image

APలోని 16 మండలాల్లో ఇవాళ 40°C పైగా టెంపరేచర్ నమోదైంది. నంద్యాల(D) దొర్నిపాడు(M)లో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. ఇక రేపు విజయనగరం(D)బాడంగి, బొబ్బిలి, తెర్లాం, వంగర.. మన్యం(D) బలిజిపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం.. పోలవరం(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం.. ఏలూరు(D) కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు వీస్తాయని చెప్పింది.

News April 9, 2026

ఇంటర్ ఫలితాలపై బోర్డు క్లారిటీ

image

TG: ఇంటర్ ఫలితాలు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది. షెడ్యూల్ ప్రకారమే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ట్వీట్ చేసింది. గతంలో ఎప్పుడూ APR మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదని గుర్తుచేసింది. మూల్యాంకన సమయాన్ని బట్టి ఫలితాల విడుదల తేదీ మారుతుందని, బోర్డు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించింది.