News March 11, 2026

ఎచ్చెర్ల: రిజల్ట్స్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ అనురాధ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆమె వెల్లడించారు. https://brau.edu.in/ వెబ్‌సైట్‌ను విద్యార్థులు చూడాలని పేర్కొన్నారు.

Similar News

News April 10, 2026

ఫ్లై 91 విమాన సేవలు ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాదుకి కొత్తగా ఫ్లై 91 విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ఈ కొత్త సర్వీసు వలన విజయవాడ, హైదరాబాదు నగరాల మధ్య ప్రయాణించే వారికి టైమింగ్స్ విషయంలో మరింత వెసులుబాటు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.

News April 10, 2026

ఎచ్చెర్ల: ప్రమాదవశాత్తు యువకుడి మృతి..!

image

ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ నవభారత్‌కు చెందిన మొదలవలస సంతోశ్(35) ప్రమాదవశాత్తు శుక్రవారం ఉదయం మృతి చెందారు. నవభారత్‌లో తను విధులు నిర్వహిస్తున్న కంపెనీలో ప్రమాదం జరగడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సంతోశ్‌కి భార్య, కుమారుడు ఉండగా ప్రస్తుతం ఆమె గర్భవతి.

News April 10, 2026

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మహానాడు..!

image

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్థల పరిశీలనకు సిద్ధమయ్యారు. రణస్థలంతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో కూడా స్థల పరిశీలన చేయనున్నారు. శుక్రవారం ఉదయం పల్లా బృందం భోగాపురం మండలంలో పర్యటించనుంది. వచ్చేనెల 27 నుంచి మహానాడు జరగనుంది.