News May 5, 2024
చోడవరం: పోటీలో నిలిచింది ఆరుగురు మాత్రమే..!

రాష్ట్రంలో అతి తక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గంగా చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ రికార్డు సృష్టించింది. ఇక్కడ కేవలం 6 మాత్రమే బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, వైసీపీ అభ్యర్థిగా కరణం ధర్మశ్రీ, కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాసరావు, బీఎస్పీ అభ్యర్థిగా మహాలక్ష్మి నాయుడు, సీపీఐ ఎంఎల్ పార్టీ అభ్యర్థిగా గణేశ్, ఇండిపెండెంట్‌గా వివేక రాజు బరిలో ఉన్నారు.
Similar News
News July 10, 2025
సత్యసాయి భక్తులు గ్రేట్…!

విశాఖలో జరిగిన గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులకు ఉపశమనం కల్పించేందుకు విశాఖ జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థ సేవలు అందించింది. ప్రదక్షిణ జరిగిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వనమూలికలతో తయారు చేసిన నూనెతో భక్తుల కాళ్లకు మర్దన చేశారు. టీ, మిర్యాల పాలు, ప్రసాదం, అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే గణబాబు వీరి సేవలను వీక్షించి అభినందించారు.
News July 9, 2025
గిరి ప్రదక్షణలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకి చేర్చిన పోలీసులు

సింహాచలం “గిరి ప్రదక్షణ”లో పైనాపిల్ కాలనీ సమీపంలో రెండు సంవత్సరాల బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం పోలీసులు గమనించి వివరాలు అడుగగా చెప్పలేకపోయాడు. వెంటనే పోలీసులు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా బాలుడు గుర్తులు తెలియజేస్తూ ప్రకటన చేశారు. బాలుడు తల్లి అది విని సమీపంలో పోలీసులు ద్వారా అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆమెకు క్షేమంగా అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
News July 9, 2025
అర్ధరాత్రి అప్పన్నకు చందనం సమర్పణ

సింహాచలం అప్పన్న స్వామికి అర్ధరాత్రి పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. దీంతో స్వామివారు పరిపూర్ణంగా నిత్య రూపంలోకి మారుతారు. 2 గంటల సమయంలో సుప్రభాత సేవ అనంతరం చందనం సమర్పిస్తారు. అనంతరం 3గంటలకు ఆరాధన, బాల భోగం, రాజ భోగం నిర్వహిస్తారు. గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు తెల్లవారుజామున 5:30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి.