News March 11, 2026
అయినవిల్లి: ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి

అయినవిల్లి మండలంలో దారుణం జరిగింది. రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై 60 ఏళ్ల యడ్ల సూరిబాబు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు రెండుసార్లు ఆఘాయిత్యం చేసినట్లు SI జ్యోతి బుధవారం తెలిపారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసిపాపపై వృద్ధుడి వికృత చేష్టలతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 30, 2026
పార్వతీపురం: సాంఘిక శాస్త్రం పరీక్షకు 99.72% హాజరు

జిల్లాలో 10వ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 99.72% మంది విద్యార్థులు హాజరైనట్లు DEO బ్రహ్మాజీ రావు తెలిపారు. సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 68 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 10542 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 30 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. ప్రైవేట్‌గా 14 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 8 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
News March 30, 2026
సంగారెడ్డి: నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: ఎస్పీ

పోలీస్ స్టేషన్లలో పరిష్కారం కానీ సమస్యలపై నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది ఎస్పీకి తమ సమస్యలు విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఆదేశించారు.
News March 30, 2026
US జెట్లకు ఎయిర్ స్పేస్ మూసేసిన స్పెయిన్

USకు నాటో దేశం స్పెయిన్ షాక్ ఇచ్చింది. ఇరాన్‌పై యుద్ధానికి వెళ్తున్న US విమానాలకు గగనతలం మూసేశామని ప్రకటించింది. అలాగే సైనిక స్థావరాల వినియోగానికి వీల్లేదని చెప్పింది. ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన యుద్ధంలో పాల్గొనొద్దన్న తమ నిర్ణయంలో ఇదో భాగమని ఆ దేశ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూర్పో వెల్లడించారు. అయితే అత్యవసర పరిస్థితులలో ఈ గగనతల మూసివేత వర్తించదు.


