News March 12, 2026

MBNR: మినీ ఎయిర్‌పోర్టుల్లా రైల్వే స్టేషన్లు..!

image

‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మహబూబ్‌నగర్ (₹39.82 కోట్లు), జడ్చర్ల (₹36.67 కోట్లు), గద్వాల (₹42.82 కోట్లు), జోగులాంబ (₹6.7 కోట్లు) నిధులతో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Similar News

News April 7, 2026

పరిశ్రమల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల స్థాపన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. మంగళవారం పరిశ్రమల పురోగతిపై యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల స్థితిగతులను ఆరా తీసిన కలెక్టర్.. ఎదురయ్యే సమస్యలను వెంటనే తెలియజేయాలని చెప్పారు. అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని, పనులు వేగంగా పూర్తి చేస్తామని యాజమానులు వెల్లడించారు.

News April 7, 2026

నంద్యాల: మందు తాగి విధులకు హాజరు.. సస్సెండ్ చేసిన కలెక్టర్

image

గోస్పాడు మండలం పసురపాడు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధులకు పంచాయతీ సెక్రటరీ విజయ భాస్కర్ రెడ్డి మద్యం తాగి హాజరైనట్లు గమనించిన కలెక్టర్.. వెంటనే పోలీసులతో బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించించారు. పరీక్షలో 100 ఎంఎల్‌కు 65 ఎంజీ ఆల్కహాల్ స్థాయి నమోదైంది. దీంతో తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 7, 2026

శబ్దమే లేని మాయా గది.. ఎక్కడుందంటే?

image

వాషింగ్టన్‌లోని మైక్రోసాఫ్ట్ కేంద్రంలో వింతైన ‘అనెకోయిక్ ఛాంబర్’ ఉంది. ఇక్కడ నిశ్శబ్దం ఏ స్థాయిలో ఉంటుందంటే.. గాలిలోని అణువుల కదలిక కూడా వినిపిస్తుంది. -20.35dB శబ్దంతో గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ గదిలో మన గుండె చప్పుడు, ఎముకల రాపిడి కూడా స్పష్టంగా వినిపిస్తాయి. ఈ రూమ్‌లో 45 నిమిషాలకు మించి ఉంటే తల తిరిగి పడిపోతారట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(40/100)