News May 5, 2024
ఈసీ నిర్ణయంపై చిత్తూరులో ఉత్కంఠ

ఇప్పటికే పుంగనూరు, పలమనేరును అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. తాజాగా పీలేరు, తంబళ్లపల్లె, చంద్రగిరి, తిరుపతిని ఆ జాబితాలోకి చేర్చింది. ఇక్కడా వెబ్ కాస్టింగ్‌తో పాటు భారీగా బలగాలను మోహరించనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉండగా.. దాదాపు సగం ప్రాంతాలపై ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News October 21, 2025
చిత్తూరు: ఇకనైనా మైనింగ్ మాఫియాకి చెక్ పడేనా..?

చిత్తూరులో కొంత కాలంగా రాయల్టీ పైకానికి బ్రేక్ పడింది. రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ టెండర్ గత నెలాఖరుతో ముగిసింది. నేరుగా మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో గ్రానైట్, గ్రావెల్ తరలింపు కొనసాగుతోంది. నూతన టెండర్ ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరో 3 నెలలు రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి పొడిగిస్తారా..? లేక నూతన టెండర్ ఖరారు చేస్తారా? అనే అంశం మరి కొన్నిరోజుల్లో తేలనుంది.
News October 21, 2025
మిమ్మల్ని చిత్తూరు ప్రజలు మరవలేరు..!

2020 నవంబర్ 8న సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఐరాల(M) రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం పొందారు. 2007లో చిత్తూరులో CKబాబుపై జరిగిన హత్యాయత్నంలో గన్‌మెన్స్ హుస్సేన్ బాషా, సురేంద్ర అమరులయ్యారు. 2017లో పలమనేరు అడవుల్లో మహిళను అత్యాచారం చేయబోయారు. నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ జవహర్ నాయక్, హోంగార్డు దేవంద్ర చనిపోయారు.
#నేడు అమరవీరుల దినోత్సవం
News October 20, 2025
చిత్తూరులో PGRS రద్దు

దీపావళి పండుగ కారణంగా సోమవారం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు ఎవరూ వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో సూచించారు.