News March 12, 2026

జగిత్యాల: ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు జమ

image

జగిత్యాల జిల్లాలో 2024-25 సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు నేరుగా వారి ఖాతాలలో జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లాలోని 1,267 మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.1,95,93,935 జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా కింద నిధులు విడుదల చేసిందన్నారు.

Similar News

News April 16, 2026

సూర్యాపేట: గ్రామస్థుల ఆదర్శ నిర్ణయం

image

‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నాగారం మండలంలో అద్భుత మార్పుకు శ్రీకారం చుట్టింది. పోలీసుల అవగాహనతో స్ఫూర్తి పొందిన ఈటూరు, ఫణిగిరి గ్రామస్థులు.. ప్రాణ రక్షణ కోసం స్వచ్ఛందంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హెల్మెట్ లేనిదే గ్రామంలోకి ప్రవేశం లేదు’ అంటూ ఊరి పొలిమేరల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలే బాధ్యతగా తీర్మానాలు చేసుకోవడం పట్ల పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

News April 16, 2026

BREAKING.. కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు

image

కరీంనగర్ నగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా కార్యాలయంలోని పలు విభాగాలకు చెందిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విజిలెన్స్ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 16, 2026

మూడు బిల్లులపై రేపు ఓటింగ్

image

లోక్‌సభలో రేపు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కేంద్రం <<19663696>>ప్రవేశపెట్టిన<<>> యూటీ చట్ట సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రేపు సా.4 గంటలకు ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. అప్పటివరకు సభలో చర్చ జరుగుతుందని, అన్నిపార్టీల సభ్యులకు మాట్లాడేందుకు అనుమతి ఇస్తామన్నారు. బిల్లులకు ఆమోదం లభిస్తుందో, లేదో రేపు ఓటింగ్ అనంతరం తేలిపోనుంది. ఎల్లుండి రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది.