News March 12, 2026
ముత్యాలమ్మ జాతరలో డ్రోన్లతో నిఘా

తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. కమాండ్ కంట్రోల్ సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు డ్రోన్ల పర్యవేక్షణ కొనసాగించారు. జాతరలో అసాంఘిక కార్యక్రమాలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వంటివి జరగకుండా అరికట్టారు.
Similar News
News April 17, 2026
హాస్టల్ విద్యార్థులకు నెల్లూరు కలెక్టర్ అభినందనలు

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం కలెక్టరేట్‌లో అభినందించారు. 479 మార్కులు సాధించిన కె.గణేష్‌తో పాటు ప్రతిభచూపిన పి.పూజ, బి.పుష్పలత, ఎస్.అనూష, టి.సుమతి, పి.శ్రీవేణుకు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు ఇలాగే కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
News April 17, 2026
నెల్లూరులో అమ్మాయిల పేరుతో మోసం

నెల్లూరు నగరంలోని ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పేరుతో ఉన్న ఫేక్ ఐడి నుంచి మెసేజ్‌తోపాటు, కాల్ చేయగా అవతలి వ్యక్తి ఏడుస్తూ అత్యవసరంగా డబ్బులు కావాలని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి భావోద్వేగపూరితమైన మాటలతో మాయ చేస్తూ నగదు కాజేసే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. మీకు తెలిసిన వారు ఎవరైనా SM వేదికగా డబ్బులు అడిగితే పంపకుండా పోలీసులకు ఫిర్యాదు చేయండి.
News April 17, 2026
నెల్లూరులో స్పెషల్ ఆఫీసర్లు కనబడటం లేదు..!

సర్పంచుల పాలన ముగిసింది. వీరి స్థానంలో 376 మంది ప్రత్యేకాధికారులు కొలువుదీరారు. ఇది జరిగి నేటికి 15 రోజులు పూర్తయినా ప్రత్యేకాధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో గ్రామస్థులు గందరగోలానికి గురవుతున్నారు. ఒక్కో అధికారికి 1 నుంచి రెండు పంచాయతీలు కేటాయించారు. చెక్ పవర్ కలిగిన వీరు గ్రామాల్లో కనిపించకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. కొన్నిచోట్ల అధికారులు అందుబాటులో ఉండక పోవడంతో పల్లె పాలన పడకేస్తోంది.


