News March 12, 2026

అనకాపల్లి జిల్లాలో వారందరి ఖాతాల్లో రూ.134 కోట్లు జమ!

image

అనకాపల్లి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద 2,42,536 మంది లబ్ధి కలుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. వీరి ఖాతాల్లో ఈ నెల 13న రూ.134.27 కోట్లు జమ అవుతాయన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,202 మంది, చోడవరంలో 51,269, మాడుగుల 45,604, ఎలమంచిలి 33,648, నర్సీపట్నంలో 35,147, పెందుర్తి 15,364, పాయకరావుపేటలో 39,302 మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.

Similar News

News April 18, 2026

సిద్దిపేట: పరీక్ష కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్ అమలు

image

మోడల్ స్కూల్ అడ్మిషన్ పరీక్షల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో BNSS 163 సెక్షన్ అమలు చేశారు. 14 పరీక్షా కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురికిపైగా గుమిగూడడం నిషేధించినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. ఈ ఆంక్షలు ఏప్రిల్ 19 ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. కేంద్రాల వద్ద జిరాక్స్ షాపులు మూసివేత, నిషేధిత పత్రాలు, ప్రమాదకర వస్తువులు తీసుకురావడంపై నిషేధం విధించారు.

News April 18, 2026

VZM: ‘బీఎల్ఏలను త్వ‌ర‌గా నియ‌మించాలి’

image

రాజ‌కీయ పార్టీలు ప్ర‌తీ పోలింగ్ కేంద్రానికి త‌మ ప్ర‌తినిధులుగా బీఎల్‌ఏల‌ను నియ‌మించి, ఆ జాబితాను త్వ‌ర‌గా అంద‌జేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.స‌త్తిబాబు కోరారు. త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో శనివారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. బీఎల్ఎల‌ను నియ‌మించుకోవ‌డం ద్వారా ఎన్నిక‌ల ప్ర‌క్రియను స‌జావుగా, పార‌ద‌ర్శ‌కంగా పూర్తి చేసేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు.

News April 18, 2026

వేగంగా కోలుకుంటున్నా.. త్వరలోనే యాక్షన్‌లోకి: వరుణ్ తేజ్

image

‘బరి’ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ <<19657793>>గాయపడిన<<>> మెగా హీరో వరుణ్ తేజ్ తన హెల్త్ అప్డేట్ వెల్లడించారు. సర్జరీ తర్వాత వేగంగా రికవరీ అవుతున్నానని ఇన్‌స్టాలో తెలిపారు. ఫుల్ స్ట్రెంత్‌తో తిరిగొస్తానని పేర్కొన్నారు. గతంలో కంటే బలంగా త్వరలోనే యాక్షన్‌లోకి దిగుతానన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ థాంక్స్ చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని సోదరి నిహారిక నిర్మిస్తున్న విషయం తెలిసిందే.