News March 12, 2026

నస్పూర్: ‘ఆన్ లైన్‌లో సిలిండర్ బుక్ చేసుకోవాలి’

image

గ్యాస్ వినియోగదారులు ఆన్ లైన్‌లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ఎల్పీజీ డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి గ్యాస్ కంపెనీల సేల్స్ అధికారులతో ఫోన్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు.

Similar News

News March 30, 2026

వనపర్తి: దివ్యాంగుల కోసం జిల్లా స్థాయి కమిటీ

image

దివ్యాంగుల సంరక్షణ ధృవీకరణ పత్రాల జారీ కోసం వనపర్తిలో జిల్లా స్థాయి కమిటీని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఏర్పాటు చేశారు. సోమవారం ప్రజావాణి హాల్‌లో ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని నియమించారు. మానసిక, బుద్ధిమాంద్యం కలిగిన దివ్యాంగుల తల్లిదండ్రులు, సంరక్షకులకు ఈ కమిటీ ద్వారా తగిన ధృవీకరణ పత్రాలు అందనున్నాయి.

News March 30, 2026

HYD: తవ్వకాలపై డ్రోన్ సర్వే.. రూ.150 కోట్ల నష్టం!

image

రాజేంద్రనగర్, మానసహిల్స్, జవహర్‌నగర్‌లో డ్రోన్ సర్వే చేస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. క్వారీలోని ఖనిజాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు LiDAR డ్రోన్ సర్వే చెబుతోంది. GOVTకి రావాల్సిన సీనియరేజ్ ఫీజు, పర్యావరణ TAX కలిపి రూ.150 కోట్ల వరకు లాస్ అయ్యింది. అదనంగా 40-50 అడుగుల లోతుకు వెళ్లినట్లు తేలింది. ఈ అడ్డగోలు తవ్వకాల వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News March 30, 2026

నల్గొండలో ఏప్రిల్ 4న మెగా జాబ్ మేళా

image

నల్గొండ MGUలో ఏప్రిల్ 4న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. వర్సిటీ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన 15 ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఈ మేళాలో పాల్గొని సుమారు 1500 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.