News March 12, 2026
Trending: HYDలో నైట్ లైఫ్‌కు కొత్త VIBE

సిటీలో నైట్ సీన్ మామూలుగా లేదు బాసూ. కేవలం బిర్యానీతోనే సరిపెట్టకుండా మన GEN-Z కొరియన్ ఫుడ్, చీజ్ బర్స్ట్ స్నాక్స్ కోసం క్యూ కడుతున్నారు. రీల్స్ కోసం ‘ఫైర్’ ఐటమ్స్, క్యాన్ డెజర్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్. వీకెండ్ వచ్చిందంటే చాలు.. లేట్ నైట్ డ్రైవ్స్, అదిరిపోయే డీజే మ్యూజిక్, లైవ్ గిగ్స్‌తో హైదరాబాద్ హోరెత్తిపోతోంది. అటు తిండి.. ఇటు మ్యూజిక్ కలిసి హైదరాబాద్ నైట్ లైఫ్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌లో ఉంటోంది.
Similar News
News April 19, 2026
పవన్ త్వరగా కోలుకోవాలి.. చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష

శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం <<19685329>>పవన్ కళ్యాణ్<<>> త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. పవన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడిని ప్రార్థించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఆయన డాక్టర్ల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోవాలని లోకేశ్ కోరారు. పవన్ ఆరోగ్యవంతుడై మళ్లీ ప్రజా సేవలో బిజీ కావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
News April 19, 2026
బబుల్ గమ్ మింగితే ఏమవుతుంది?

బబుల్ గమ్ మింగితే ఏళ్లపాటు అది కడుపులోనే ఉండిపోతుందనేది అపోహ మాత్రమేనని వైద్యులు తేల్చిచెప్పారు. ‘జీర్ణం కాకపోయినా ఆహారనాళం నుంచి కడుపులోకి, అక్కడి నుంచి పేగుల్లోకి ప్రయాణించి 4-5 రోజుల్లో మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది శరీరంలోని అవయవాలకు ఎక్కడా అతుక్కోదు. కడుపు నొప్పి, వాంతుల లాంటి సమస్యలూ రావు. పొరపాటున మింగితే కంగారు పడాల్సిన పనిలేదు. అలా అని కావాలని మింగొద్దు’ అని డాక్టర్లు చెబుతున్నారు.
News April 19, 2026
అనకాపల్లి: రహదారిపై బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..!

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారిపై బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


